ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్ కన్నుమూత

 ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్ కన్నుమూత

ప్రముఖ రచయిత,  తెలంగాణ వాది కొంపెల్లి వెంకట్ గౌడ్  కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో  చికిత్స పొందతూ ఇవాళ (సెప్టెంబర్ 25) తుది శ్వాస విడిచారు. కొంపెల్లి వెంకట్ గౌడ్ వొడువని ముచ్చట, నీళ్ల ముచ్చట, సర్వాయి పాపన్న చరిత్ర  వంటి పుస్తకాలను రాశారు. 

కొంపెల్లి మృతిపట్ల సీనీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.  కొంపెల్లి వెంకట్ గౌడ్  ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని కలిగించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన సాహిత్య రంగంలో,సమాజ సేవలో, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి మరువలేనిదని చెప్పారు.  గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా చాటారని... సర్వాయి పాపన్న చరిత్రను అక్షర బద్దం చేసి ప్రజలకు అందించారని తెలిపారు.  తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న కొంపెల్లి వెంకట్ గౌడ్  మృతి తెలంగాణకు  తీరని లోటు అని చెప్పారు.  వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఈ దుఃఖాన్ని తట్టుకుని ధైర్యంగా ఉండాలని కోరారు.

ఫ్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని వొడువని ముచ్చటగా పుస్తక రూపంలో రాశారు కొంపెల్లి. నీటి పారుదల నిపుణుడు విద్యాసాగర్ రావు ఆలోచనలను నీళ్ల ముచ్చగా..నోముల సత్యనారాయణ వంటి వాళ్ల జీవితాలను గ్రంథస్తం చేశారు. సర్వాయి పాపన్న చరిత్రను అక్షర బద్దం చేసి ప్రజలకు అందించారు కొంపెల్లి వెంకట్ గౌడ్.