
బెంగళూరు: తెలంగాణ యంగ్ స్టర్ ఈ. జ్యోతి రెడ్డి ఇండియా సీనియర్ విమెన్స్ హాకీ ప్రాబబుల్స్ టీమ్‌కు ఎంపికైంది. రాబోయే ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీల కోసం హాకీ ఇండియా(హెచ్‌ఐ) సోమవారం 33 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. మిడ్ ఫీల్డర్ జ్యోతి ఇందులో చోటు దక్కించుకుంది. ఇటీవల నేషనల్ హాకీ టోర్నీలో రాణించిన ప్లేయర్లకు ప్రాబబుల్స్‌లో ప్లేస్ లభించింది. ఈ ప్లేయర్లంతా మే 16 వరకు నేషనల్ క్యాంప్‌లో ట్రెయినింగ్ తీసుకొని, మే 22 నుంచి మొదలయ్యే ఎఫ్‌ఐహెచ్ సిరీస్‌లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తారు.