
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టీఆర్ఏఐ) అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 08.
పోస్టుల సంఖ్య: 10.
పోస్టులు: అసోసియేట్ కన్సల్టెంట్ (టెక్నికల్) ఈసీఈ 04, అసోసియేట్ కన్సల్టెంట్ (టెక్నికల్) సీఎస్ 01, అసోసియేట్ కన్సల్టెంట్ (టెక్నికల్) డీఎస్ 03, అసోసియేట్ కన్సల్టెంట్ (ఈసీఓ) 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, ఎంఏ, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంఫిల్/ పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 18.
లాస్ట్ డేట్: అక్టోబర్ 08.
పూర్తి వివరాలకు vacancies.trai.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.