
గచ్చిబౌలి, వెలుగు: టాలీవుడ్యాక్టర్ కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేశ్ (30)పై ఐటీ కారిడార్ ఉమెన్పీఎస్లో కేసు నమోదైంది. ఏపీలోని కృష్ణ జిల్లా హనుమాన్జంక్షన్కు చెందిన కాకాని ధర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. సింధూరం, డ్రింకర్సాయి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.
అతనికి 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గాఉన్న చిరుమామిళ్ల గౌతమి పరిచయమైంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2019లో పెండ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. గ్రామ రాజకీయాల్లో తిరుగుతున్న ధర్మకు ఏదైనా బిజినెస్ చేద్దామని భార్య సూచించింది. గౌతమి తండ్రి ఆర్థిక సాయం చేయడంతో దంపతులిద్దరూ కలిసి ఏపీ, హైదరాబాద్‌లో రెస్టారెంట్లను ప్రారంభించి ఫ్రాంచైజీలు ఓపెన్ చేశారు.
ఈ క్రమంలో సినిమా అవకాశాలు పెరగడం, జల్సాలకు అలవాటు పడ్డ ధర్మ యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రస్తుతం తన పలుకుబడి పెరిగిందని, ఇప్పుడు రూ.500 కోట్లు కట్నంగా ఇచ్చేవారు రెడీగా ఉన్నారని, అదనపు కట్నం కావాలంటూ వేధింపులకు గురిచేశారు. దీంతో గౌతమి తల్లిదండ్రులు రెండు కార్లకు, రెస్టారెంట్బిజినెస్పెంచేందుకు డబ్బులు ఇచ్చారు.
►ALSO READ | Balan: ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడి మరో మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్
అయినా తీరు మారకపోవడంతో భర్త, అత్తమామలు, ఆడబిడ్డ వేధింపులపై గౌతమి ఐటీ కారిడార్ఉమెన్పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .గతంలోనూ తన భర్తపై షీ టీమ్‌కు గౌతమి ఫిర్యాదు చేయగా, కౌన్సెలింగ్ తర్వాత కూడా తీరు మారకపోవడంతో మళ్లీ పోలీసులను
ఆశ్రయించారు.