రివ్యూ: పాగల్

రివ్యూ: పాగల్

రన్ టైమ్: 2 గంటల 10 నిమిషాలు
నటీనటులు: విశ్వక్ సేన్,నివేతా పేతురాజ్,సిమ్రన్ కౌర్,మేఘ లేఖ, మురళీ రమేష్,రాహుల్ రామకృష్ణ, మహేష్,రాంప్రసాద్ తదితరులు
మ్యూజిక్: రధన్
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్
రచన,దర్శకత్వం: నరేష్ కొప్పిలి
రిలీజ్ డేట్: ఆగస్ట్ 14,2021

కథేంటి?

ప్రేమ్ (విశ్వక్ సేన్) కు వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం.తనను బాగా ప్రేమిస్తుంది. జెన్యూన్ గా లవ్ చేస్తే ఫ్యూచర్లో ఎవరైనా నా లాగా తిరిగి ప్రేమిస్తారు అని తన తల్లి చెప్తుంది.తను చనిపోయిన తర్వాత అలాంటి జెన్యూన్ అమ్మాయి కోసం వెతుకుతాడు.1600 మంది కి ఐ లవ్యూ చెప్తాడు.ముగ్గురు యాక్సెప్ట్ చేసి వెంటనే రిజక్ట్ చేస్తారు.షాకింగ్ గా ఓ రాజకీయ నాయకుడి (మురళీ శర్మ) వెంట పడి ప్రేమించమంటాడు.ఆ తర్వాత అతన్ని షూట్ చేస్తాడు.ఎందుకు ఆయనను చంపాలనుకున్నాడు? చివరికి అతన్ని జెన్యూన్ గా లవ్ చేసే అమ్మాయి దొరికిందా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో విశ్వక్ సేన్ మంచి ఈజ్ తో నటించాడు. పర్ఫార్మెన్స్ కు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలో తన శక్తిమేర నటించాడు. కానీ లవర్ బాయ్ రోల్ కు పర్ఫెక్ట్ గా సూట్ కాలేదు.నివేతా పేతురాజ్ బాగా చేసింది.సిమ్రన్ చౌదరి చిన్న రోల్ లో ఫర్వాలేదనిపించింది.మేఘలేఖ జస్ట్ ఓకే. రాహుల్ రామకృష్ణ,మురళీశర్మ,మహేష్,రాంప్రసాద్ తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు. 

టెక్నికల్ వర్క్:

మూవీ టెక్నికల్ గా రిచ్ గా ఉంది. రధన్ పాటల్లో రెండు బాగున్నాయి.జేమ్స్ లియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్.మణికందన్ విజువల్స్ అందంగా ఛూపించాడు.యాక్షన్ సీన్లు,ఆర్ట్ వర్క్,ప్రొడక్షన్ వాల్యూయ్స్ అన్నీ చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. డైలాగ్స్ కొన్ని మాత్రమే బాగున్నాయి.

విశ్లేషణ:

‘‘పాగల్’’ మూవీ మిస్ ఫైర్ అయింది. కథ,దర్శకుడు అనుకున్న పాయింగ్ డిఫరెంట్ గానే అనిపించినా..దాన్ని డీల్ చేయడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు.కొత్త డైరక్టర్ కావడం,ఎక్స్ పీరియన్స్ లేకపోవడం సమస్య.ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా అనిపించినా.. సెకండాఫ్ నీరసంగా ఉంది. రెగ్యులర్ లవ్ ట్రాక్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్.కొన్ని సీన్లు మరీ సిల్లీ గా,లాజక్ లెస్ గా ఉన్నాయి.కొందరు ప్రేక్షకులు అప్పటికే ‘‘టైటిల్ కు జస్టిఫికేషన్ ’’ అంటూ థియేటర్ ఎగ్జిట్ డోర్ల వైపు పరుగులు పెట్టడం కనిపించింది. ఇక హీరో విశ్వక్ సేన్ చాలా వరకు తన ఎనర్జీ,నటనతో సేవ్ చేయాలని చూసాడు.కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోయేలా ఉంది కాబట్టి లాభం లేకపోయింది.ఈ సినిమాలో విశ్వక్ కొన్ని సార్లు ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేయాలని చూసినట్టు అనిపిస్తుంది.ఇంతకు ముందు తన సినిమాలల్లో ఇది కనపించలేదు.ఓవరాల్ గా హీరో స్టేజ్ ముందు చెప్పినంత కంటెంట్ ఈ సినిమాలో ఏం లేదు. ఆ స్పీచ్ విని ఎక్కువ అంచనాలతో వెళ్తే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు.

బాటమ్ లైన్: టైటిల్ జస్టిఫికేషన్ అయింది.