అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిని గద్దె సాయి సూర్య అవినాశ్ (26) యూస్ లోని న్యూయార్క్ లో తన అక్క దగ్గర ఉండి మాస్టర్స్ చదువుతున్నాడు. 7 జూలై ఆదివారం కావడంతో అక్క కుటుంబంతో కలిసి న్యూయార్క్‌ సమీపంలోని అల్బానీ ప్రాంతంలో ఉన్న బార్బర్‌విల్లీ జలపాతానికి అవినాశ్‌ వెళ్లాడు. 

నీటి ఉదృతికి అవినాష్ కాలుజారి కిందపడి కొట్టుకుపోయాడు. అతడ్ని రక్షించేందుకు మరొకరు నీటిలోకి  దూకగా అతడు కూడా కొట్టుకుపోయాడు. అయితే వెంటనే అక్కడి భద్రతా దళాలు, సహాయ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడగా.. అవినాశ్‌ మాత్రం మృతి చెందాడు. శుక్రవారం అవినాష్ డెడ్ బాడీ స్వగ్రామానికి చేరుకుంటుంది. అవినాష్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామం. ఎంఎస్‌ చేయడానికి 2023 జనవరిలో అమెరికా వెళ్లాడు. నెల కిందట ఇద్దరు తెలుగు విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల్లో జలపాతాల సందర్శనకు వెళ్లి మరణించారు.

ALSO READ | లోన్ యాప్ వేధింపులు.. కిడ్నీ అమ్ముకున్న యువకుడు...