న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. మెగా టోర్నీలో క్వాలిఫయర్–2కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్–3 మ్యాచ్‌లో టైటాన్స్ 46–39తో పట్నా పైరేట్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆల్‌రౌండర్ భరత్ హుడా ఒక్కడే 23 పాయింట్లతో చెలరేగి జట్టును గెలిపించడంతో పాటు ఈ సీజన్‌లో 200 రైడ్ పాయింట్ల మైలురాయి చేరాడు.
కెప్టెన్ విజయ్ మాలిక్ (5 పాయింట్లు) కూడా రాణించాడు. పుణె స్టార్ రైడర్ అయాన్ 22 పాయింట్లు రాబట్టినా ఆ టీమ్‌కు నిరాశ తప్పలేదు. బుధవారం జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో టైటాన్స్.. పుణెరి పల్టాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో నెగ్గిన జట్టు శుక్రవారం దబాంగ్ ఢిల్లీ కేసీతో ఫైనల్లో పోటీపడుతుంది.
