
జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం లేదని పూరీ గోవర్ధన్ మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని జ్యోతర్మఠ్ పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తనతో పాటు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు దేశంలో నెలకొల్పిన నాలుగు ప్రముఖ పీఠాల అధిపతులు, మత పెద్దలు ఎవరూ హాజరు కారని స్పష్టం చేశారు. దీనికి కారణం.. ఈ వేడుకను శాస్త్ర పద్దతుల్లో నిర్వహించడం లేదనేనని చెప్పారు.
'మోదీ వ్యతిరేకి' కాదు కానీ 'శాస్త్ర వ్యతిరేక' వేడుకలో పాల్గొనలేను
ఈ వేడుక శాస్త్రాలు, పవిత్రమైన హిందూ గ్రంధాలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారని అవిముక్తేశ్వరానంద సరస్వతి చెప్పారు. ఈ వీడియో జనవరి 9న ఆయన తన అధికారిక Xఖాతాలో షేర్ చేసిన వీడియోలో చెప్పారు. దాంతో పాటు జ్యోతిర్మఠం 46వ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి, నలుగురు శంకరాచార్యులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మోదీకి వ్యతిరేకంగా చేస్తున్నట్టు అర్థం చేసుకోవద్దని ఉద్ఘాటించారు. తాము శాస్త్ర వ్యతిరేకులం కాకూడదనే, పవిత్ర గ్రంథాల (శాస్త్రాలు) సూత్రాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కొద్ది రోజుల క్రితమే పూరీలోని గోవర్ధన పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి.. ప్రాణ ప్రతిష్ట (స్థాపన) కార్యక్రమానికి దూరంగా ఉండాలని తన ఉద్దేశాన్ని ప్రకటించారు.
— Swati Dixit ಸ್ವಾತಿ (@vibewidyou) January 10, 2024