భక్తి పేరుతో అర్చకుడి మోసం: మూడు కోట్ల భూమి మాయం

భక్తి పేరుతో అర్చకుడి మోసం: మూడు కోట్ల భూమి మాయం

ఆంధ్ర ప్రదేశ్: భక్తి పేరుతో మూడు కోట్ల విలువైన భూమిని కాజేశాడు ఓ అర్చకుడు. ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం లో నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి గుడి అర్చకుడైన గోపాలరావు… అమ్మవారి పేరిట అస్ధి రాస్తే దోషం పోతుందని నర్రా శ్రీనివాసరావు అనే భక్తుడిని నమ్మించాడు. దీంతో అతడి నుంచి మూడు కోట్ల రూపాయల విలువ చేసే నాలుగు ఎకరాల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో పాటు… 10లక్షల నగదు.. 20తులాల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. ఆస్తికొంటున్నానంటూ శ్రీనివాసరావును  బుకాయించాడు. మోస పోయానని తెలుసుకున్న శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించాడు. అతను ఇచ్చిన ఫిర్యాదుతో అర్చకుడు గోపాలరావుపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.