కోవిడ్ హాస్పిటళ్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

కోవిడ్ హాస్పిటళ్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

కరోనావైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది మృతిచెందారు. రొమేనియాలోని పియాట్రా నీమ్ట్ కౌంటీ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగి పక్క గదికి వ్యాపించాయి. మంటలు ఎలా వచ్చాయో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు వ్యక్తులు సహా ఆన్ డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. ఆస్పత్రిలోని మరో ఆరుగురు పేషంట్లను వేరే హస్పిటల్‌కు షిష్ట్ చేస్తామని హెల్త్ మినిష్టర్ నెలు టాటారు తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వైద్యుడికి 40% తీవ్రమైన కాలిన గాయాలయ్యాయని వెంటనే అతన్ని రాజధాని బుకారెస్ట్‌లోని ఆస్పత్రికి తరలిస్తామని మంత్రి టాటారు చెప్పారు. ‘స్థానిక ఆస్పత్రులను ప్రస్తుతం కౌంటీ కౌన్సిల్స్ నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తుంది’ అని ఆయన అన్నారు.

రొమేనియాలో ఇప్పటివరకు 3,53,185 కరోనావైరస్ కేసులు మరియు 8,813 కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దాదాపు 13 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 1,172 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నారు.