ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సంచలనం.. ప్రిక్వార్టర్స్‎లోనే వరల్డ్ నెంబర్‎వన్ స్వైటెక్‌‌‌‌ ఔట్

ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సంచలనం.. ప్రిక్వార్టర్స్‎లోనే వరల్డ్ నెంబర్‎వన్ స్వైటెక్‌‌‌‌ ఔట్

పారిస్‌‌‌‌: ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌ ప్రిక్వార్టర్‌‌‌‌ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌లో 15వ సీడ్‌‌‌‌ మార్తా కోస్ట్యుక్‌‌‌‌ (ఉక్రెయిన్‌‌‌‌) 7–5, 6–1తో స్వైటెక్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌)పై గెలిచి తొలిసారి క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. క్లే కోర్టుపై కోస్ట్యుక్‎కు వరుసగా 16వ విజయం. గంటా 39 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఇద్దరు ప్లేయర్లు బలమైన సర్వీస్‌‌‌‌లతో చెలరేగారు. 

తొలి సెట్‌‌‌‌లో తొలి బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో స్వైటెక్‌‌‌‌ 5–4 ఆధిక్యంలో నిలిచింది. కానీ వరుసగా డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌, ఫోర్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ తప్పిదాలు చేయడంతో కోస్ట్యుక్‌‌‌‌ 5–5తో స్కోరు సమం చేసింది. 12వ గేమ్‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌ మరో తప్పిదం చేయడంతో కోస్ట్యుక్‌‌‌‌ సెట్‌‌‌‌ను సాధించింది. రెండో సెట్‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌) 4–6, 6–4, 6–0తో బెనిసిచ్‌‌‌‌ (కెనడా)పై, సొరానా క్రిస్టీ (రొమేనియా) 6–3, 7–6 (7/4)తో వాంగ్‌‌‌‌ (చైనా)పై గెలిచారు. మెన్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో జ్వెరెవ్‌‌‌‌ (జర్మనీ) 7-–6 (7/3), 6–4, 6–1తో  డి జోంగ్‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌)పై, రఫెల్‌‌‌‌ జోదర్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌) 4–6, 4–6, 6–1, 6–2, 6–2తో కారెనో బుస్టా (స్పెయిన్‌‌‌‌)పై గెలిచారు.