అంపైర్ పై రష్యా టెన్నిస్ ప్లేయర్ ఆగ్రహం

అంపైర్ పై రష్యా టెన్నిస్ ప్లేయర్ ఆగ్రహం

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో నిన్న(శుక్రవారం) జరిగిన సెమీఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ మ్యాచ్ మధ్యలో అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ కు గ్యాలరీలో కూర్చున్న అతడి తండ్రి సలహాలు ఇస్తున్నాడని మెద్వెదెవ్ ఆరోపించాడు. నీకది కనిపించడంలేదా? నువ్వు మూర్ఖుడివా? అంటూ అంపైర్ పై ఫైర్ అయ్యాడు. అయితే ఆ రష్యా టెన్నిస్ ఆటగాడు అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు.

మెద్వెదెవ్ పై టోర్నీ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు రూ.9 లక్షల జరిమానా విధించారు. ఇందులో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకున్నందుకు రూ.6 లక్షలు, అభ్యంతరకర పదజాలం వాడినందుకు మరో రూ.3 లక్షలు జరిమానా వేశారు.

మెద్వెదెవ్ శుక్రవారం జరిగిన సెమీస్ లో గెలిచి ఫైనల్ చేరాడు. ఫైనల్లో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ తో తలపడనున్నాడు. టైటిల్ సమరంలో ఓడినా మెద్వెదెవ్ కు రన్నరప్ కింద రూ.8 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.

మరిన్ని వార్తల కోసం...

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు