బంజారాహిల్స్లోని ఎంపీ అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

బంజారాహిల్స్లోని ఎంపీ అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

బంజారాహిల్స్లోని బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి టీఆర్ఎస్ భవన్కు నిరనస ర్యాలీకి ప్లాన్ చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.

ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అర్వింద్ ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు.

అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తులు విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ  దహనం చేశారు. ప్రస్తుతం ఎంపీ అర్వింద్ నిజామాబాద్లో ఉన్నారు.