కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేటు వద్ద  ఉద్రిక్తత నెలకొంది.  బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ ప్లెక్సీలను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్వీ నేతలు ప్రయత్నించారు.  ఈ క్రమంలో దీంతో పోలీసులకు,  నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది.

కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే హక్కు లేదని,  నిరుద్యోగ మార్చ్ అడ్డుకుంటామని హెచ్చరించారు.  దీంతో నిరసన కారులను పోలీసులు ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాకతీయ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్ ​చేయాలని, పేపర్ల లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో భారీ ర్యాలీ చేపడుతున్నారు. దీనికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.

హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్​ నుంచి నయీంనగర్, పెట్రోల్​పంప్, పోలీస్ ​హెడ్ ​క్వార్టర్స్ మీదుగా అంబేద్కర్ జంక్షన్​ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ర్యాలీ.. దాదాపు 2 కిలోమీటర్ల మేర సాగనుంది.