చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్.. బంధువుల ఆందోళన

చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్.. బంధువుల ఆందోళన

కేపీహెచ్ బీలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చనిపోయిన వ్యక్తికి చికిత్స చేశారంటూ మృతుని బంధువులు హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. మధుసూదన్ అనే వ్యక్తి మూడ్రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో ట్రీట్ మెంట్ రేంజ్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అయితే అతను రెండ్రోజుల క్రితమే చనిపోయినా డబ్బుల కోసం డాక్టర్లు చికిత్స చేసినట్లు నటించారని బంధువులు ఆరోపించారు. హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. పోలీసులు సైతం హాస్పిటల్ మేనేజ్ మెంట్ కే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.