ఉద్యోగాల భర్తీ కోసం బీజేవైఎం ఆందోళన

ఉద్యోగాల భర్తీ కోసం బీజేవైఎం ఆందోళన

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు నుంచి బయలుదేరి టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. అయితే వీరిని గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులు అడ్డుకోవటంతో... అక్కడే బైటాయించారు. ప్లకార్డులతో నిరసనకు దిగి రోడ్డుకు మీద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.