కరెంట్ ఖాతా లోటుపై టెన్షన్.. జీడీపీలో 2 శాతానికి పెరిగే ప్రమాదం.. క్రిసిల్ రిపోర్ట్హెచ్చరిక

కరెంట్ ఖాతా లోటుపై టెన్షన్.. జీడీపీలో 2 శాతానికి పెరిగే ప్రమాదం.. క్రిసిల్ రిపోర్ట్హెచ్చరిక

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం కొనసాగితే భారత్ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) జీడీపీలో రెండు శాతానికి పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రిపోర్ట్​ హెచ్చరించింది. ముడి చమురు ధరలు, గ్యాస్ ఖర్చులు, ఎరువుల దిగుమతులు పెరగడం వల్ల వాణిజ్య లోటు విస్తరిస్తోంది. ముడి చమురు ధర 2–3 శాతం పెరిగితే దిగుమతుల భారం భారీగా పెరుగుతుంది. ఎగుమతులపై కూడా ఒత్తిడి పడుతోంది. పశ్చిమ ఆసియాకు జరిగే ఎగుమతులకు అంతరాయం కలగడం, షిప్పింగ్, బీమా ఖర్చులు పెరగడం ప్రతికూలంగా మారాయి.

అక్కడి దేశాల నుంచి వచ్చే ఆదాయం (రెమిటెన్స్​లు) తగ్గే ప్రమాదం ఉంది. సేవల రంగం నుంచి వచ్చే మిగులు కొంత ఊరటనిచ్చినప్పటికీ, భౌగోళిక ఉద్రిక్తతలు కరెంట్ ఖాతా లోటును ప్రభావితం చేస్తాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల దేశీయ డిమాండ్ తగ్గి భారత్ ఆర్థిక వృద్ధి 7.1 శాతం నుంచి 6.8 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. తయారీ, నిర్మాణం, సేవల రంగాలపై ఇన్​పుట్ ఖర్చుల ప్రభావం అధికంగా ఉంటుందని క్రిసిల్ రిపోర్ట్​ వివరించింది.