బాబ్రీ మసీదుకూల్చివేతను నిరసిస్తూ.. సైదాబాద్‌లో ముస్లిం మహిళల నిరసన ప్రదర్శన

బాబ్రీ మసీదుకూల్చివేతను నిరసిస్తూ.. సైదాబాద్‌లో ముస్లిం మహిళల నిరసన ప్రదర్శన

హైదరాబాద్: నగరంలోని సైదరాబాద్  ఈద్గా గ్రౌండ్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం (డిసెంబర్5) సాయంత్రం ఈద్గా గ్రౌండ్ లో వందల సంఖ్యలో  ముస్లిం మహిళలు గుమి కూడడంతో  టెన్షన్ వాతావరణం  కనిపించింది.

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ భారీ సంఖ్యలో ముస్లిం మహిళలు గ్రౌండ్ కు వచ్చారు. దర్గా జిహాద్ ఓ షహ్‌దాత్‌కు చెందిన మహిళలు నిరసన ప్రదర్శన పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు 300 ముస్లిం మహిళలు, బాలికలు పాల్గొన్నారు.సామూహిక ప్రార్థనల తర్వాత డిసెంబర్ 6 బ్లాక్ డే  ప్లకార్డులు పట్టుకొని బాలికలు, మహిళలు  నిరసన వ్యక్తం చేశారు.