- బ్రస్సెల్స్ మెట్రో స్టేషన్ లో మిరాకిల్
- రైలు వచ్చే సమయంలో పట్టాలపై నెట్టేసిన దుర్మార్గుడు
- డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రాణాలతో బయటపడిన మహిళ
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ మెట్రో స్టేషన్ లో మిరాకిల్ జరిగింది. ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. రైలు కోసం ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రైలు వచ్చే సమయంలో బ్లాక్ టీ షర్టు వేసుకున్న వ్యక్తి ఓ మహిళను కావాలనే కిందకు నెట్టేశాడు. బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక ఆమె పట్టాలపై పడింది. అదే సమయంలో ప్లాట్ ఫామ్ పైకి రైలు వస్తోంది. ఇక ఆమె ప్రాణాల మీద అందరూ ఆశలు వదులుకున్నారు. పెద్దగా కేకలు వేశారు. ఆమె కూడా ఇదే చివరి రోజు అనుకుని ఉంటుంది. కానీ డ్రైవర్ సమయ స్ఫూర్తిగా వ్యవహరించి బ్రేకులు వేయడంతో కొద్ది దూరంలో రైలు ఆగిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అక్కడున్న వారందరూ వెళ్లి పట్టాలపై పడిపోయిన ఆమెను పైకి లేపి ప్లాట్ ఫామ్ మీదకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆమెను ఆ వ్యక్తి రైలు పట్టాలపైకి ఎందుకు నెట్టేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది.
