- రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: హాల్ టికెట్ల కోసం విద్యార్థులు స్కూళ్లు, కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తొలిసారి వాటిని మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
గతంలో వెబ్‌సైట్లలో సర్వర్ సమస్యలు రావడం, ఫీజులు చెల్లించకపోతే కాలేజీ ప్రిన్సిపాళ్లను బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సారి ఆ తిప్పలు తప్పనున్నాయి.
