- కలెక్టర్‌కు రిపోర్ట్ అందజేసిన బెల్లంపల్లి ఎంఈవో పోచయ్య
- నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్,
- డిపార్ట్ మెంటల్ ఆఫీసరపై వేటుకు రంగం సిద్ధం
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లి హైస్కూల్ టెస్త్ స్టూడెంట్ సిద్ది అంజమ్మ ఘటనలో ఆఫీసర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. అంజమ్మ అడ్వాన్డ్స్సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో భాగంగా గత నెల 8న మంచిర్యాల జడ్పీ గర్ల్స్ హైస్కూల్ సెంటర్లోని 4వ నంబర్ రూమ్‌లో మ్యాథ్స్పరీక్ష రాసింది. ఆమెకు ఐదో నంబర్ రూమ్కేటాయించగా.. మరో విద్యార్థిని స్థానంలో నాలుగో నంబర్ రూమ్‌లో కూర్చొని ఎగ్జామ్ రాసింది.
ఇన్విజిలేటర్ మధుసూదనాచారితో పాటు సెంటర్చీఫ్సూపరింటెండెంట్పద్మావతి, డిపార్ట్మెంటల్అధికారి బి.రవీందర్ఈ విషయాన్ని గమనించకుండా అంజమ్మ ఆబ్సెంట్అయినట్టు రిపోర్టు ఇచ్చారు. దీంతో ఆమె ఫెయిల్ అయినట్లు రిజల్ట్ వచ్చింది. దీంతో అంజమ్మ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆన్సర్‌షీట్లను పరిశీలించి ఆమె ఎగ్జామ్ రాసినట్లు నిర్ధారించి పాస్‌చేస్తూ తాజాగా మెమో జారీ చేశారు. ఈ విషయంలో బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు. ఈ మేరకు బెల్లంపల్లి ఎంఈవో పోచయ్య విచారణ జరిపి రిపోర్ట్ ను బుధవారం సాయంత్రం కలెక్టర్ కుమార్‌దీపక్‌తో పాటు అడిషనల్కలెక్టర్, ఇన్చార్జి డీఈవో పి.చంద్రయ్యకు అందజేశారు.
ముగ్గురు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అంజమ్మకు అన్యాయం జరిగిందని నిర్ధారించారు. దీంతో ఇన్విజిలేటర్, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై కలెక్టర్కుమార్దీపక్ మాట్లాడుతూ.. ఎంక్వైరీ రిపోర్టు అందిందని, బాధ్యుల నుంచి వివరణ తీసుకున్న అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
