
తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా పాల్గుణమాసంలో పౌర్ణమినాడు ముగిసేలా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ముందుగా శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను మాడవీధుల నుండి పుష్కరిణికి తీసుకొచ్చారు. కోనేరులో అందంగా ముస్తాబైన తెప్పపై ఉత్సవమూర్తలను ఉంచారు. పుష్కరిణిపై విహరించిన తర్వాత….ఉత్సవ విగ్రహాలను ఆలయానికి తీసుకొచ్చారు. ఇవాళ సాయంత్రం రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి…. తెప్పపై పుష్కరిణిలో విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఇవాళ వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది TTD.