సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సిద్దిపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామం వద్ద ఆటోను జీపు ఢీకొన్న ప్ర‌మాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు ఆటో డ్రైవర్ రమేష్ (35 ), ప్రయాణికులు శ్రీశైలం (26 ), గడ్డం కనకయ్య (35)గా గుర్తించారు. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా వారిని హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ చాట్లపల్లి గ్రామస్తులు సంఘటన స్థలం వద్ద రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.