ఆర్మీలో చేరేందుకు మంచి అవకాశం.. టెన్త్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఆర్మీలో చేరేందుకు మంచి అవకాశం.. టెన్త్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

టెరిటోరియల్ ఆర్మీ దక్షిణ కమాండ్​లోని హెడ్​క్వార్టర్స్​లో సోల్జర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.  

పోస్టులు: 1426.

పోస్టుల సంఖ్య: సోల్జర్ (జనరల్ డ్యూటీ) 1372,  సోల్జర్ (క్లర్క్) 07, సోల్జర్ (చెఫ్​కమ్యూనిటీ) 19, సోల్జర్ (చెఫ్​ స్పెషల్) 03, సోల్జర్ (మెస్ కుక్) 02, సోల్జర్ (ఈఆర్) 03, సోల్జర్ (స్టివార్డ్) 02, సోల్జర్ (ఆర్టిజన్ మెటలర్జీ) 02, సోల్జర్ (ఆర్జిటన్ వుడ్​వర్క్) 02, సోల్జర్ (హెయిర్ డ్రెస్సర్) 05, సోల్జర్  (టైలర్) 01, సోల్జర్ (హౌస్ కీపర్) 03, సోల్జర్ (వాషర్ మెన్) 04. 

ఎలిజిబిలిటీ
సోల్జర్ (జనరల్ డ్యూటీ): గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 45 శాతం మార్కులతో పదోతరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే,  ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉండాలి.

సోల్జర్ (క్లర్క్): గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి .

సోల్జర్ ట్రేడ్స్​మెన్ (అన్ని ట్రేడ్లు): పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించి ఉండాలి.

సోల్జర్ ట్రేడ్స్​మెన్ (హౌస్​కీపర్, మెస్ కుక్): 8వ తరగతి చదివి ఉండాలి. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 42 ఏండ్లు ఉండాలి. నిబంధలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 15.

లాస్ట్ డేట్: డిసెంబర్ 01. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


రిక్రూట్​మెంట్ ఏరియా
సోల్జర్ (జనరల్ డ్యూటీ) 298,  సోల్జర్ ట్రేడ్స్​మెన్–11 (క్లర్క్ 01, చెఫ్ కమ్యూనిటీ 05, చెఫ్ స్పెషల్ 01, స్టివార్డ్ 01, ఆర్టిజన్ మెటలర్జీ 01, హెయిర్ డ్రెస్సర్ 01, హౌస్​కీపర్ 01) పోస్టులకు నవంబర్ 19వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యదాద్రి భువనగిరి జిల్లాల్లో రిక్రూట్​మెంట్ ర్యాలీ చేపట్టనున్నారు. 

ఎగ్జామ్ ప్యాటర్న్
ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ విజయవంతంగా పూర్తిచేసిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్​/ హిందీ మాధ్యమంలో ఇస్తారు. ప్రశ్నల స్థాయి సీబీఎస్ఈ పదోతరగతి స్థాయిలో ఉంటాయి. సోల్జర్ క్లర్క్ మినహా మిగతా అన్ని పోస్టులకు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 32 నిమిషాల సమయం ఇస్తారు. జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు 40 మార్కులకు, జనరల్ సైన్స్ 15 ప్రశ్నలు 30 మార్కులకు, మ్యాథ్స్ 15 ప్రశ్నలు 30 మార్కులకు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఖాళీగా వదిలిపెట్టిన ప్రశ్నలకు ఎలాంటి మార్కుల కోత ఉండదు.  

సోల్జర్ (క్లర్క్)
జనరల్ నాలెడ్జ్​ 5 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ సైన్స్ 5 ప్రశ్నలు 10 మార్కులకు, మ్యాథ్స్ 10 ప్రశ్నలు 20 మార్కులకు, కంప్యూటర్ సైన్స్ 5 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు 50 మార్కులకు అడుగుతారు.  ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 

పూర్తి వివరాలకు ncs.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.