
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిస్టులు ఓ వలస కూలీని చంపేశారు. బిహార్‌కు చెందిన కార్మికుడిని హతమార్చారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో జరిగింది. శుక్రవారం గాయాలపాలైన కార్మికుడి మృతదేహాన్ని రోడ్డు పక్కన స్థానికులు గుర్తించారు.
చికిత్స కోసం వెంటనే అతడిని సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ అధికారులు, జమ్మూకాశ్మీర్ పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేసిన రెండ్రోజులకే ఈ ఘటన జరిగింది. టెర్రరిస్టులు స్థానికేతరులను హతమార్చడం అనేది ఈ ప్రాంతంలో సాధారణంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ లో టెర్రరిస్టులు ఇద్దరు స్థానికేతరులను హతమార్చారు.