
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. తాజాగా సత్యసాయి జిల్లా ధర్మవరం కోట కాలనీలో ఉగ్రవాదులతో సంబంధం ఉందన్న అనుమానంతో నూర్ అనే వ్యక్తిని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఓ హోటల్లో పని చేస్తోన్న నూర్‌కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు ఐబీ గుర్తించింది.
ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 16) అతడిని అదుపులోకి తీసుకున్నారు ఐబీ ఆఫీసర్స్. ఉగ్రవాదులతో నూర్‌కు సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నూర్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి పెట్టారు అధికారులు. అలాగే నూర్ ఆర్ధిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నూర్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.