‘పై ఫోనా’ మజాకా.. అంతరిక్షం నుంచీ కాల్స్

‘పై ఫోనా’ మజాకా..  అంతరిక్షం  నుంచీ కాల్స్
  • టెస్లా అత్యాధునిక ‘పై ఫోన్’  వస్తోంది
  • రహస్యంగా అభివృద్ధి ప్రక్రియ
  • 2024కల్లా మార్కెట్లోకి విడుదల  

ప్రపంచంలోనే అడ్వాన్స్ డ్ స్మార్ట్  ఫోన్ రూపుదిద్దుకుంటోంది. అది ఎంత అడ్వాన్స్ డ్ అంటే.. అంగారక గ్రహం పై నుంచి  కూడా భూమిపై ఉండే మనవాళ్లకు కాల్ చేసి మాట్లాడొచ్చు. అంతేకాదు సెల్ ఫోన్ టవర్లు లేని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా దర్జాగా ఇంటర్నెట్ ప్రపంచంలో విహరించవచ్చు. బఫరింగ్ కు తావు లేని వీడియో కాల్స్ ను గ్రామీణ ప్రజలూ  ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ ఇంత అద్భుత ఫీచర్లు కలిగిన ఫోన్ ఏ కంపెనీదో తెలుసా ? శాంసంగ్, మోటొరోలా, షావోమి, నోకియా కంపెనీలది మాత్రం కాదు. టెక్నాలజీ తైకూన్ టెస్లా కంపెనీ ఫోన్ అది. దానిపేరు ‘ పై ఫోన్ ’. ఔను.. మీరు చదివింది నిజమే. 2023 చివరికల్లా లేదా 2024 తొలినాళ్లలో ‘పై ఫోన్’  మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈమేరకు మీడియాలో ప్రచురితమైన వార్తలను టెస్లా కంపెనీ ఇప్పటివరకు ఖండించనూ లేదు. సమర్ధించనూ లేదు. మౌనం అర్ధాంగీకరం అన్నట్టుగా.. టెస్లా మౌనాన్ని అంగీకారంగా భావించవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. అయితే ‘పై ఫోన్’  ధరపై ఇంకా స్పష్టత రాలేదు. అత్యంత రహస్యంగా ఈ ఫోన్ కు సంబంధించిన అభివృద్ధి ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. 

దిమ్మతిరిగే ఫీచర్స్ .. 

  • టెస్లా ‘పై ఫోన్’   ప్రత్యేకత ఏమిటంటే.. దాన్ని టెస్లా ఎలక్ట్రిక్ కార్లతోనూ అనుసంధానం చేసుకోవచ్చు. ఆ కార్ల నావిగేషన్ కు ‘పై ఫోన్’ ను ఒక రిమోట్ తరహాలో వాడొచ్చు. అందుకు సంబంధించిన సెట్టింగ్స్ ను కూడా ఈ ఫోన్ నుంచే చేయొచ్చని అంటున్నారు.  
  • టెస్లా కంపెనీ ‘ స్టార్ లింక్’  సర్వీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. వీటి ద్వారా  లభించే శాటిలైట్ హైస్పీడ్  ఇంటర్నెట్ సేవలను పై ఫోన్లోనూ  పొందొచ్చు. దీనికి సంబంధించిన బిల్ట్ ఇన్ సెట్టింగ్స్ తో ఫోన్ వస్తుంది. అంటే  ఈ ఫోన్ ను తీసుకొని ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళ్లినా.. నిరంతరాయంగా ఇంటర్నెట్ లో విహరించవచ్చు. పల్లె ప్రజలు కూడా బఫరింగ్ లేని వీడియో కాల్స్ ద్వారా తమ వాళ్లతో మాట్లాడొచ్చు. ఈ పరిణామమే సాకారమైతే గొప్ప సమాచార విప్లవానికి పునాది పడినట్లు అవుతుంది. 
  • టెస్లా గ్రూప్ కు అనుబంధంగా ఉన్న మరో కంపెనీ పేరు ‘న్యూారాలింక్’ . ఇది మనిషి మెదడులో అమర్చే చిప్ ల తయారీలో నిమగ్నమైంది. భవిష్యత్తులో వెన్నెముక సమస్యలతో బాధపడే వారు, మతిమరుపు సమస్యలు కలిగినవారి కోసం ఈ బ్రెయిన్ చిప్ లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటిని ‘పై ఫోన్’  ద్వారా నియంత్రణ చేయొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.  
  • స్పేస్ ఎక్స్ అనే అంతరిక్ష యాత్రల కంపెనీ కూడా టెస్లాదే. ఇది ఔత్సాహికులను అంతరిక్ష టూరిజం కోసం తీసుకెళ్తుంటుంది. ఇలా ఇతర గ్రహాలపైకి వ్యోమగాములు వెళ్లి ఆవాసాలు ఏర్పర్చుకుంటే.. భూమి పై ఉన్న తమ వాళ్లతో మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం ఇతర గ్రహాల నుంచి భూమి పైకి కాల్ చేయడానికి భారీగా ఖర్చవుతోంది. కాల్ కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం కూడా పడుతోంది. ఈ పరిమితులన్నీ అధిగమించేలా ‘పై ఫోన్’  ఉంటుందని అంటున్నారు. అంగారకుడి పైకి వెళ్లినా .. భూమికి ఈజీగా కాల్ చేయొచ్చని చెబుతున్నారు. 

  మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు

 డాక్టర్ ను సస్పెండ్ చేసిన మంత్రి హరీష్ రావు