టెస్లా కార్లు ఇండియాలో తయారు చేయండి

టెస్లా కార్లు ఇండియాలో తయారు చేయండి

అమెరికన్ కరెంట్ కార్ల కంపెనీ టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్ భారత్‌లోకి తన కంపెనీ కార్లను తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టెస్లా కార్లను ఇండియాలోకి తెస్తామని, అయితే పన్ను మినహాయింపులు ఇవ్వాలని మస్క్ గతంలో భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ రియాక్ట్ అయింది. టెస్లా కంపెనీ కార్లను భారత్‌లో తయారు చేస్తే పన్ను రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘‘వోకల్ ఫర్ లోకల్” ప్రాజెక్టులో భాగం కావాలని పిలుపునిచ్చారు. ‘‘టెస్లా కంపెనీ పన్ను రాయితీలు కోరుకుంటుంటే.. లోకల్‌గా కార్ల తయారీ, అసెంబ్లింగ్ చేస్తామని కమిట్‌మెంట్ ఇవ్వాలి” అని తెలిపారు. 

25 నుంచి 100 శాతం పన్ను..

ప్రస్తుతం ఉన్న పన్నుల టారిఫ్‌తోనే భారత్‌లోకి ఇతర విదేశీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను అమ్మేందుకు ముందుకు వస్తున్నాయని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి చెప్పారు. ఇంకా ఏవైనా కంపెనీలు రావాలనుకున్నా రావొచ్చన్నారు. అయితే విదేశాల్లో పూర్తిగా సిద్ధమైన వాహనాలను భారత్‌లోకి తీసుకొచ్చి అమ్మాలంటే 25 శాతం నుంచి 100 శాతం వరకు ఇంపోర్ట్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నులో రాయితీలు కల్పించాలని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ గతంలో భారత ప్రభుత్వాన్ని కోరారు. ముందుగా దేశంలో పన్నులు తగ్గించి, ఇతర కంపెనీలతో పోటీ పడి అమ్మకాలు జరిపే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌‌లో కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మినిస్ట్రీతో టెస్లా అధికారులు భారత్‌లో తమ బిజినెస్ ప్లాన్ గురించి చర్చించారు. అయితే పన్నులు ఎక్కువగా ఉన్న కారణంగానే వెనుకడుగేస్తున్నట్లు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం..

చావు భయం లేదు.. నాకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కర్లేదు

రిపబ్లిక్‌ డే: తివిధ దళాల్లో బెస్ట్ పరేడ్‌ విన్నర్‌‌గా నేవీ

జగన్‌.. దమ్ముంటే అభిమానాన్ని అలా చాటుకో