ముగిసిన ‘టెట్’.. 82.09 శాతం హాజరు.. మొత్తం 1.95 లక్షల మంది అభ్యర్థులు అటెండ్: టెట్ కన్వీనర్ రమేశ్

ముగిసిన ‘టెట్’.. 82.09 శాతం హాజరు.. మొత్తం 1.95 లక్షల మంది అభ్యర్థులు అటెండ్: టెట్ కన్వీనర్ రమేశ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్​లు (టీజీటెట్) ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల3న ప్రారంభమైన ఈ టెస్టులు మంగళవారంతో పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షలకు ఓవరాల్ గా 82.09 శాతం మంది అటెండ్ అయినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు. టెట్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,95,181 మంది పరీక్ష రాశారు. 

42,573 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో పరీక్షకు డుమ్మా కొట్టారు. పేపర్–-1లో 83.24%, పేపర్–-2 మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 80.85%, పేపర్-2 సోషల్ స్టడీస్ లో 82.25% హాజరు నమోదైంది. పరీక్షల హాజరులో ఇన్-సర్వీస్ టీచర్ల హాజరు శాతం ఏకంగా 90.27% ఉండగా, ఇతరుల హాజరు శాతం 78.49% గా నమోదైంది.