
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సెక్రటేరియట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకుంది. 1000 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి, పొన్నం హాజరయ్యారు. డ్రోన్ షో ద్వారా ప్రభుత్వ పథకాలు, చారిత్రాత్మక కట్టడాలను వివరించారు. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.
తెలంగాణ తల్లి విగ్రహం, మహిళలకు ఫ్రీ బస్, రైజింగ్ తెలంగాణ నంబర్ 1, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, రైతే రాజు, రేవంతన్న సన్నబియ్యం, అందరికీ వైద్యం ఆరోగ్యశ్రీ, చార్మినార్, ఇందిరాగాంధీ మహిళా శక్తి, 72వ మిస్ వరల్డ్ అని డ్రోన్ల ద్వారా ఆవిష్కరించారు.
ALSO READ | పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందాల భామల సందడి: తుపాకులు పట్టుకుని ఫోజులు
అంతకుముందు అందాల భామలు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌లకు పోలీస్ అశ్విక దళం, పైపు బ్యాండ్, మోటర్ సైకిల్ రైడర్స్, స్నిప్పర్ డాగ్ స్క్వాడ్లతో పోలీస్ శాఖ ఘన స్వాగతం పలికింది. అనంతరం పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడిటోరియంలో పోలీస్ శాఖ అమలు చేస్తోన్న పలు విధానాలు, అవి పనిచేసే విధానంపై అందాల భామలకు ప్రజంటేషన్ ద్వారా వివరించారు.రాష్ట్ర ప్రభుత్వ పటిష్టమైన విధానాలవల్ల రాష్ట్రంలో 17 శాతం నేరాలు తగ్గాయని, వివిధ అంశాలలో తెలంగాణా పోలీస్ కు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయని వారికి చెప్పారు.