26 నుంచి పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు

26 నుంచి పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న పీజీఎల్ సెట్ వెబ్​ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 26, 27 తేదీల్లో ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ పి. రమేశ్ బాబు తెలిపారు. ఈ నెల 24 వరకు రిజిస్ర్టేషన్లకు అవకాశం ఉందని చెప్పారు. 30న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ఉంటుందని వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 5 వరకూ కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.