హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్వీసు టీచర్ల నిర్వహించిన టీజీ టెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈనెల 26న ఉదయం 11గంటలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో ఉన్నతాధికారులు ఫలితాలు విడుదల చేయనున్నట్టు టెట్ కన్వీనర్ గాజర్ల రమేష్ తెలిపారు.
ఇన్సర్వీస్ టీచర్లకు ఈ నెల 8, 9 తేదీల్లో టీజీ టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 24,986 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 22,477 మంది హాజరయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం అభ్యర్థులు తమ రిజల్ట్స్, స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
