విద్యార్థిగా ఉన్నప్పుడే BJPలో పనిచేశా: TG వెంకటేశ్

విద్యార్థిగా ఉన్నప్పుడే BJPలో పనిచేశా: TG వెంకటేశ్

బీజేపీతో తనకున్న బంధం ఈనాటిది కాదన్నారు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్. తెలుగుదేశం పార్టీని వీడి.. బీజేపీలో చేరుతున్నట్టు ఆయన ఢిల్లీలో చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నానని చెప్పారాయన. బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ నాయకులే తనను ఆహ్వానించారన్నారు. తాను కాంగ్రెస్ లో కొంతకాలం పనిచేశానన్నారు. తన కుటుంబం టీడీపీలో ఉండటంతో… ఎంపీగా ఎన్నికై అదే పార్టీలో కొనసాగానని చెప్పారు. ఐతే.. బీజేపీతోనే తన ప్రజాజీవితం మొదలైందన్న టీజీ వెంకటేశ్.. విద్యార్థి దశలోనే బీజేవైఎంలో చురుగ్గా పనిచేశానని చెప్పారు.