టీజీ20 లీగ్‌‌ మ్యాచ్‌.. హర్షిత్‌‌ సెంచరీ.. వరంగల్‌‌ వారియర్స్‌‌ విజయం

టీజీ20 లీగ్‌‌ మ్యాచ్‌.. హర్షిత్‌‌ సెంచరీ.. వరంగల్‌‌ వారియర్స్‌‌ విజయం

హైదరాబాద్‌‌, వెలుగు: ఛేజింగ్‌‌లో హర్షిత్‌‌ చౌదరి (121 నాటౌట్‌‌) సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం జరిగిన టీజీ20 లీగ్‌‌ మ్యాచ్‌‌లో వరంగల్‌‌ వారియర్స్‌‌ 5 వికెట్ల తేడాతో అన్విత ఖమ్మం ఏసెస్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 రన్స్‌‌కు ఆలౌటైంది.

మయాంక్‌‌ గుప్తా (54), మికిల్‌‌ జైస్వాల్‌‌ (54), హిమతేజ (23), ప్రతీక్‌‌ రెడ్డి (20) రాణించారు. అబ్దుల్‌‌ మాలిక్‌‌, మురుగన్‌‌ అభిషేక్‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత వరంగల్‌‌ 18.5 ఓవర్లలో 208/5 స్కోరు చేసి నెగ్గింది. హర్షిత్‌‌ సెంచరీకి తోడు రిషికేత్‌‌ సిసోడియా (27) ఫర్వాలేదనిపించాడు. సాకేత్‌‌ 2 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.