దుబాయ్: టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఐసీసీ ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ (791) మూడు స్థానాలు మెరుగుపడి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో 84, 154 రన్స్ చేయడం గిల్ ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది.
డారిల్ మిచెల్ (815) టాప్‌లో ఉండగా, విరాట్ కోహ్లీ (768), రోహిత్ శర్మ (754) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. కేఎల్ రాహుల్ (651).. 11వ ర్యాంక్‌కు పడిపోగా, శ్రేయస్ అయ్యర్ (638).. 14వ ర్యాంక్‌ను సాధించాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (614) ఆరో ర్యాంక్‌లోనే ఉండగా, అర్ష్‌దీప్ సింగ్ (536).. 22వ ర్యాంక్‌కు చేరాడు. ప్రసిధ్ కృష్ణ (450).. 58వ ర్యాంక్‌లో ఉన్నాడు.
