విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర

విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర

లీడ్స్‌‌: విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఎలైస్‌‌ పెర్రీ (71), జార్జియా వోల్‌‌ (39), అనాబెల్ సదర్లాండ్‌‌ (27), నికోలా కెరీ (26 నాటౌట్‌‌) రాణించడంతో.. మంగళవారం జరిగిన గ్రూప్‌‌–1 లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆసీస్‌‌ 113 రన్స్‌‌ తేడాతో పాకిస్తాన్‌‌పై గెలిచింది. టాస్‌‌ నెగ్గిన ఆసీస్‌‌ 20 ఓవర్లలో 199/7 స్కోరు చేసింది.

బెత్‌‌ మూనీ (0), ఆష్లే గార్డ్‌‌నర్‌‌ (0), జార్జియా వారెహామ్‌‌ (5), సోఫియా మోలినుక్స్‌‌ (5) నిరాశపర్చారు. తర్వాత పాకిస్తాన్‌‌ 13.4 ఓవర్లలో 86 రన్స్‌‌కే ఆలౌటైంది. మునీబా అలీ (32) టాప్‌‌ స్కోరర్‌‌. ఫాతిమా సనా (17), ఇరామ్‌‌ జావెద్‌‌ (14) పోరాడి విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌‌లో ఎనిమిది మంది సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితం కావడంతో పాక్‌‌ కోలుకోలేకపోయింది. పెర్రీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.