ట్రైఫెడ్ తో టీజీసీసీ ఎంవోయూ

ట్రైఫెడ్ తో టీజీసీసీ ఎంవోయూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గిరిజన రైతులు సేకరించిన అటవీ ఉత్పత్తుల(ఎంఎఫ్ పీ)కు కనీస మద్దతు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రైఫెడ్ (ట్రైబల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ముందుకొచ్చింది. ఇందుకోసం రాష్ట్ర గిరిజన కో ఆ–పరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీసీసీ), ట్రైఫెడ్ మధ్య ఎంవోయూ కుదిరింది. సోమవారం సెక్రటేరియెట్​లో స్పెషల్ సీఎస్, జీసీసీ ఎండీ సబ్యసాచిఘోష్ తో ట్రైఫెడ్ ఎండీ రాజమురుగన్ ఎంవోయూ కుదుర్చుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ప్రకారం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ట్రైఫెడ్ కేంద్ర స్థాయిలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. గిరిజన సంక్షేమశాఖ కింద ఉన్న తెలంగాణ గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడంతో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికానున్నాయి. ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడిన గిరిజన రైతులకు ప్రయోజనం కలుగుతుంది. మరోవైపు, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్​గా బీఎం సంతోష్ బాధ్యతలు స్వీకరించారు.