టీజీఈసెట్​కు 18,928 మంది హాజరు

టీజీఈసెట్​కు 18,928 మంది హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్​లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈసెట్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు ఎగ్జామ్ జరిగింది. ఈ ఆన్ లైన్ ఎగ్జామ్ పాస్ వర్డ్ ను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్, ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తదితరులు ఓయూలో రిలీజ్ చేశారు. ఈ ఎగ్జామ్​కు మొత్తం19,672 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 18,928 (96.22%) మంది హాజరయ్యారు