95% ఉద్యోగాల్లో స్థానికులే ఉండాలె

95% ఉద్యోగాల్లో స్థానికులే ఉండాలె

కొత్త జిల్లాల ప్రకారమే ఉద్యోగుల కేటాయింపు ఉంటుందన్నారు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్. త్వరగా ఉద్యోగుల విభజన చేయాలని సీఎస్ ను కలిశామన్నారు. ఉద్యోగుల విభజనపై తమ సూచనలు, సలహాలు తీసుకున్నారన్నారు. సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడంతో పాటు  లోకల్ క్యాడర్‌‌కు అనుకూలంగా విభజన జరుగుతుందని టీజీవో ప్రెసిడెంట్ మమత అన్నారు. ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు. జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల విభజనపై ఈ రోజు బీఆర్కే భవన్‌లో టీజీవో, టీఎన్జీవో నేతలు సీఎస్‌తో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం 10  జిల్లాల స్థానంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారని, ఈ క్రమంలో ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సద్దుబాటు చేస్తే వారికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పామని  టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిడ్ల రాజేందర్ తెలిపారు. 95 శాతం ఉద్యోగాల్లో స్థానికులే ఉండేలా చూడాలని కోరామన్నారు. తమ సూచనపై సీఎస్ సానుకూలంగా స్పందించారని అన్నారు.