- సమ్మర్లో బదిలీలు చేపట్టండి: టీజీవో వినతి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర సర్కారును టీజీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, శ్యామ్ లు డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక గడువు ముగిసి ఇప్పటికే 22 నెలలు అయిందని నేతలు బుధవారం ఓ ప్రకటనలో గుర్తు చేశారు. గడువు ముగిసిన ప్రభుత్వం పొడిగిస్తున్నదని తెలిపారు. ఇప్పటికైనా పీఆర్సీ ప్రకటించాలని కోరారు.
గతేడాది సమ్మర్ లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ఈ ఏడాది అయినా ఇవ్వాలన్నారు. గత 6 నుంచి 13 ఏండ్లుగా ఒకే దగ్గర ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. నవంబర్ 2024 నుంచి పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో పీఆర్సీకి నిధులు కేటాయించాలని శ్రీనివాసరావు, శ్యామ్ లు విజ్ఞప్తి చేశారు.
