టీజీవో రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అసోసియేషన్ ఎన్నిక

టీజీవో రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అసోసియేషన్ ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2026–2029 కాలానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం నాంపల్లిలోని టీజీవో కేంద్ర సంఘం కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేట్ ప్రెసిడెంట్‌‌‌‌గా హరికోట్ల రవి, జనరల్ సెక్రటరీగా నరేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మహమ్మద్‌‌‌‌తో పాటు పలువురు ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ఎన్నికైనట్లు ప్రకటించారు.

టీజీవో సిటీ బ్రాంచ్ ప్రెసిడెంట్, డిప్యూటీ సెక్రటరీ గండూరి వెంకటేశ్వర్లు ఈ ఎన్నికలకు అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. సెంట్రల్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ జిల్లా శాఖల అధ్యక్ష, కార్యదర్శులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.