TGPSC: గ్రూప్-3 షెడ్యూల్ ..ఎగ్జామ్ టైమింగ్స్ ఇవే..

TGPSC: గ్రూప్-3 షెడ్యూల్ ..ఎగ్జామ్ టైమింగ్స్ ఇవే..

 టీజీపీఎస్ సీ  గ్రూప్ -3 ఎగ్జామ్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. నవంబర్ 17, 18న ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది.  17వ తేదీన పేపర్ 1  ఉదయం 10 గంటల నుంచి12.30 గంటల వరకు.  పేపర్ -2 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5: 30 గంటల వరకు ఉంటుంది

నవంబర్ 18 న పేపర్ 3  ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ఉంటుందని వెల్లడించింది.  నవంబర్ 10న https//www.gov.in లో  హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులను  ఎగ్జామ్ కు  ముందు ఉదయం 8.30 గంటల నుంచే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు.

తెలంగాణలో 1,363 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అదనంగా మరో 12 పోస్టులు చేర్చారు. మొత్తం 1,375 పోస్టుల కోసం 5.36 లక్షల మంది అప్లై చేసుకున్నారు.