జూలై 13న ఆర్టీసీ కార్గోలో వేలం

జూలై 13న ఆర్టీసీ కార్గోలో వేలం

హైదరాబాద్​సిటీ, వెలుగు: టీజీఎస్​ఆర్టీసీ కార్గో విభాగంలో కస్టమర్లు క్లెయిమ్​ చేయని వస్తువులను సోమవారం వేలం వేస్తున్నట్లు కంటోన్మెంట్​డిపో మేనేజర్​కవిత ఒక ప్రకటనలో తెలిపారు. పార్సిల్​ఫిట్​మెంట్​వాల్యూపై 50 శాతం తక్కువగా వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. 

ఆటోమొబైల్​స్పేర్స్, బయోమెడికల్, క్లాత్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, జనరల్, ఫార్మా, స్టేషనరీ వంటివి 52 వస్తువులు ఉన్నాయన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు జూబ్లీ బస్ స్టేషన్​లోని కార్గో కౌంటర్​లో వేలం జరుగుతుందని పేర్కొన్నారు.