హైదరాబాద్సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గోలో క్లైమ్చేయని వస్తువులను వేలం వేయనున్నట్టు ఆర్టీసీ అసిస్టెంట్ట్రాఫిక్ మేనేజర్(లాజిస్టిక్) ఇషాక్బిన్మహ్మద్ఒక ప్రకటనలో తెలిపారు. లాజిస్టిక్లో బుకింగ్చేసి డెలివరీ తీసుకోని ఉత్పత్తులను ఈనెల 8వ తేదీన జేబీఎస్లోని కార్గో ఆఫీసులో మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు. బట్టలు, ఎలక్ట్రికల్స్, జనరల్, స్టేషనరీ వంటి ఉత్పత్తులను వేలం వేయనున్నట్టు చెప్పారు.
