ఇంటి వద్దకే  సీతారాముల తలంబ్రాలు..టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో ప్రత్యేక సేవలు

ఇంటి వద్దకే  సీతారాముల తలంబ్రాలు..టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో ప్రత్యేక సేవలు

మేడిపల్లి, వెలుగు : భద్రాచల సీతారామస్వామి కల్యాణోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే తీసుకొచ్చేందుకు టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆర్టీసీ సికింద్రాబాద్‌ డివిజన్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ జీఎన్‌.పవిత్ర పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం చెంగిచర్ల డిపోలో మేనేజర్‌ కవితతో కలిసి ఆవిష్కరించారు.

తలంబ్రాలు కావాలనుకునే వారు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ అనిల్‌కుమార్‌ (9154208831, 9010334184)ను సంప్రదించి బుకింగ్ నమోదు చేసుకోవాలని సూచించారు.