పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. 30 మంది ఉంటే చాలు.. మీరు కోరిన చోటికి తీసుకెళ్తరు

పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. 30 మంది ఉంటే చాలు.. మీరు కోరిన చోటికి తీసుకెళ్తరు

మల్కాజిగిరి, వెలుగు: భక్తుల కోసం కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయని డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ తెలిపారు. కాశీ, పూరీ, షిరిడీ, గోవాలతో పాటు పలు ప్రసిద్ధ ప్రాంతాలకు ఈ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. 

కనీసం 30 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే, వారు కోరిన గమ్యస్థానానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని మేనేజర్ స్పష్టం చేశారు. యాత్రలు చేయాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందస్తు రిజర్వేషన్, ఇతర వివరాల కోసం 9603549388, 9959226145 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.