అరుదైన వైరస్తో 72 పులులు మృతి..థాయ్లాండ్ పార్కుల్లో ఘటనలు

అరుదైన వైరస్తో 72 పులులు మృతి..థాయ్లాండ్ పార్కుల్లో ఘటనలు

బ్యాంకాక్: ప్రాణాంతక వైరస్ సోకి థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌లో 72 పులులు మృతిచెందాయి. ఆ దేశంలోని టైగర్ కింగ్‌‌‌‌డమ్ మే టెంగ్, టైగర్ కింగ్‌‌‌‌డమ్ మే రిమ్ అనే రెండు ప్రైవేట్ యానిమల్ పార్కుల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నెల 8 నుంచి 19 వరకు మే టెంగ్‌‌‌‌లో 51 టైగర్లు, మే రిమ్‌‌‌‌లో 21 టైగర్లు మరణించాయని రీజనల్ ప్రొటెక్టెడ్ ఏరియా ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌లోని టైగర్ కింగ్‌‌‌‌డమ్ పార్కుల్లో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద మాస్ డెత్ గా తెలిసింది. చియాంగ్ మాయ్ ప్రావిన్షియల్ లైవ్‌‌‌‌స్టాక్ ఆఫీస్ వెటర్నరీ టీమ్‌‌‌‌లు చేసిన ఆటాప్సీలలో వైరస్ ఉన్నట్టు గుర్తించారు. పులుల కళేబరాల నుంచి తీసిన సాంపిల్స్ ల్యాబ్ పరీక్షలలో క్యానైన్ డిస్టెంపర్ వైరస్ (సీడీవీ) అలాగే, మైకోప్లాస్మా బ్యాక్టీరియాను కూడా గుర్తించినట్టు చెప్పారు.