డ్యామ్‌‌ ఎండింది.. గుడి కనబడింది

డ్యామ్‌‌ ఎండింది.. గుడి కనబడింది

సెంట్రల్‌‌ థాయ్‌‌లాండ్‌‌లో తీవ్రమైన కరువు వల్ల ఓ డ్యామ్‌‌ ఎండిపోయింది. నీళ్లు 3 శాతానికి చేరుకున్నాయి. దీంతో జలాశయాన్ని చూసేందుకు తండోపతండాలు జనం ఎగబడుతున్నారు. ఎండిపోతే ఏముంటది చూడటానికి అనుకోవచ్చు. అక్కడో బుద్ధిస్ట్‌‌ టెంపుల్‌‌ బయటపడింది మరి. 20 ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చింది. డ్యామ్‌‌ మధ్యలో ఉన్న ఆ గుడిని చూసేందుకు ప్రజలతో పాటు బౌద్ధ సన్యాసులూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆ గుడి చాలా వరకు పాడైపోయింది. అప్పట్లో ఆ గుడికి పక్కనే 700 ఇళ్లు ఉండేవి. కానీ డ్యామ్‌‌ కట్టడంతో ఖాళీ చేయాల్సి వచ్చింది. 20 ఏళ్లలో తొలిసారి 2015లో గుడి ఆనవాళ్లు కనిపించాయి. 960 మిలియన్‌‌ క్యూబిక్‌‌ మీటర్ల కెపాసిటీ ఉన్న ఆ డ్యామ్‌‌ 13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. కానీ కరువు వల్ల ప్రస్తుతం కేవలం 3 వేల ఎకరాలకే అందుతోంది. ఈ దశాబ్దంలో ఇంతలా కరువును చూడలేదని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా డ్యామ్‌‌లన్నీ ఎండిపోయాయన్నారు.