LEO-Glimpse of Harold Das: లియో అప్డేట్..హెరాల్డ్ దాస్ గ్లింప్స్ రిలీజ్..యాక్షన్‌ కింగ్‌ అర్జున్ బీభత్సం

LEO-Glimpse of Harold Das: లియో అప్డేట్..హెరాల్డ్ దాస్ గ్లింప్స్ రిలీజ్..యాక్షన్‌ కింగ్‌ అర్జున్ బీభత్సం

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి యాక్షన్‌ కింగ్‌ అర్జున్ బర్త్ డే స్పెషల్ గా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. లియో హెరాల్డ్ దాస్ గ్లింప్స్( Harold Das Glimpse)  పేరుతో రాగా.. ఇందులో అర్జున్ భీకరమైన లుక్స్ తో కనిపిస్తున్నారు. కార్లోంచి దిగి..సిగెరెట్ తాగుతూ, రౌడీలా మధ్యన నడుస్తున్న తీరు చూస్తుంటే లియోలో పవర్ ఫుల్ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. తెరికే అంటూ సింగిల్ డైలాగ్ తో అర్జున్ బీభత్సం క్రియేట్ చేస్తున్నారు . ఇక తనలోని రాక్షస హింసను చూపించిన లోకేష్.. అమాంతం లియోపై హైప్ పెంచేశారు.  

 ఇక ‘మాస్టర్’ మూవీ విజయం తర్వాత  విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్‌‌, సంజయ్‌‌దత్‌‌, ప్రియా ఆనంద్‌‌, మన్సూర్ అలీఖాన్‌‌, గౌతమ్ మీనన్‌‌, మిస్కిన్‌‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.