విజయ్‌‌ నెక్స్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ ఫిక్స్

విజయ్‌‌ నెక్స్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌‌కి టాలీవుడ్‌‌ లోనూ మంచి ఇమేజ్ ఉంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ‘మాస్టర్’ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌ని ఆదివారం అఫీషియల్‌‌గా అనౌన్స్ చేశారు. ఇటీవల నాగచైతన్యతో ‘కస్టడీ’ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు డైరెక్షన్‌‌లో విజయ్ నటించనున్నాడని తెలిపారు.

యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నట్టు, ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ఇంటరెస్టింగ్‌‌ వీడియోతో ఈ కేజ్రీ కాంబినేషన్‌‌ను ప్రకటించారు. ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే ఏడాది వేసవికి సినిమా విడుదల చేయనున్నట్టు తెలియ జేశారు. ఇది విజయ్‌‌కి 68వ సినిమా. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ‘విజయ్‌‌తో సినిమా చేయాలనే నా కల నిజమైంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వెంకట్ ప్రభు.